వైయస్ షర్మిల నేడు సోదరుడు వైయస్ జగన్ ఇంటికి వెళ్ళనున్నారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించనున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం. 4 గంటలకు జగన్ తో భేటీ అవుతారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది.
అయితే జగన్ తో నేరుగా భేటీ జరగకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం జనవరి 18న, వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. ఇది ఇలా ఉండగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వస్తున్నటువంటి ఊహాగానాలపై వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయని వైవి సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరిన తమకి ఇలాంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు.