వైసీపీ కి ఇంకా 100 రోజులు గడువు వుంది. అయితే ఈ గడువు ముగిసిపోకుండానే ప్రభుత్వాన్ని నడిపే నైతికత కోల్పోయింది అంటూ టిడిపి నాయకుడు కాల్వ శ్రీనివాసులు కామెంట్స్ చేసారు. అలానే, రాజకీయాల్లో మార్పు కావాలి. వింత జరుగుతోంది. జగన్ ని మార్చాలని ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు. ఈ టైం లో తాడేపల్లి ప్యాలెస్ కి సెల్యూట్ కొట్టే విధంగా మారింది అని అన్నారు. అలానే, అక్రమ కేసులు పెట్టి వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే గొంతు కోసాడు.
నాలుగేళ్లుగా రాయదుర్గం ప్రజల గొంతు కాపు కోయలేదా అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వనరులు దోచేస్తూ పరిపాలన ఎలా చెయ్యకూడదు అనేది చూపిస్తున్నారు అని కాల్వ శ్రీనివాసులు అన్నారు. అలానే, జగన్ నైతికంగా ఎప్పుడో ఓడిపోయారు అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి వున్న వాళ్లకి మేముస్వాగతం పలుకుతాం అని అన్నారు. అలానే అంగన్వాడిల పై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గం అన్నారు.