బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది అని మంత్రి జూపల్లి కామెంట్స్ చేసారు. పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో అస్సలు సౌకర్యాలు లేవని ఏ అభివృద్ధి చేయలేదన్నారు. అలానే ఎల్లారం తాండాకు ఇప్పటి దాకా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చినా దాఖలాలు లేవు అన్నారు. గూగుల్ మ్యాప్ లో ఈ తాండా పేరూ లేదన్నారు. అలానే రెవెన్యూ శివారు లేదు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఇదంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇవన్నీ చూసే ప్రజలు కాంగ్రెస్ ని తీసుకు వచ్చారన్నారు. మేము ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల దగ్గరకే ప్రజా పాలన తెచ్చాం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేసారని.. ఆరు గ్యారంటీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం అన్నారు. అలానే దశల వారీగా మిగితా హామీలను కూడా చేస్తామన్నారు. ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తాం అని కూడా చెప్పారు.