ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే.. ఈ నెల 8 తేదీనే విజయవాడ చేరుకోనుంది సీఈసీ బృందం. ఈ ఎన్నికల బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పాల్గొంటారు. 9 తేదీ ఉదయం ఏపీలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది సీఈసీ బృందం.
అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై సీఈసి సమీక్ష నిర్వహించనుంది. 10 తేదీన ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అనంతరం కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసి సమావేశం ఉంటుంది. పదో తేదీ సాయంత్రం 4.30 గంటలకు సీఈసి, ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం ఢిల్లీకి వెళ్లనుంది కేంద్ర ఎన్నికల కమిషన్.