22 ఏళ్ల మోహిత్‌ పాండేను రామమందిరంలో పూజారిగా ఎందుకు ఎన్నుకున్నారు..?

-

అయోధ్య రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కానుంది. యావత్‌ దేశం ఈ మహాఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచుస్తోంది. ఇప్పుడు రామమందిరంలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్టతో పాటు.. ఆ పూజకు ఎంపిక చేసిన పూజారుల గురించి కూడా చర్చ నడుస్తుంది. 22 ఏళ్ల మోహిత్‌ పాండే రామ మందిరంలో పూజలు చేసేందుకు ఎంపిక అయ్యారు. అంతే.. అందరూ మోహిత్‌ పాండే ఎవరు, 3000 మంది పాల్గొన్న పరిక్షలో మొదటి ర్యాంకు ఏ విధంగా సాధించాడు, 22 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు అంత బాధ్యతను పోషించగలడా అని ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అవును ఇంతకీ ఈ మోహిత్‌ పాండే ఎవరు..? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం.

అయోధ్యలో రాముడికి 31 సంవత్సరాల నుంచి ఆచార్య సత్యేంద్రదాస్‌ పూర్తి అంకిత భావంతో పూజలు చేస్తున్నారు. ఆయన తన పూర్తి జీవితాన్ని ఆ రాముడికి అంకితం చేశారు. 1958లో శాశ్వతంగా అయోధ్యకు వచ్చారు. 1992లో రామ జన్మభూమిలో మందిరం యొక్క ప్రధాన అర్చకుడిగా నియమించబడ్డారు. అప్పటి నుంచి రాముడికి పూజలు చేస్తున్నారు. నూతన మందిరంలో కూడా సత్యేంద్రగారే ప్రదాన అర్చకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 85 ఏళ్లు. ఈ కారణంగా యూపీ ప్రభుత్వం రామ మందిరంలో ఆయన తర్వాత ప్రధాన అర్చకుడిగా నియమించే బాధ్యతను సత్యేంద్రదాస్‌కు అప్పగించారు. 2023లో యూపీ ప్రభుత్వం రామమందిరం పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న 3000 మంది పూజారుల్లో మోహిత్‌ పాండే కూడా ఒకడు.

పరీక్ష ఎలా జరిగింది

శ్రీరామ మందిరం ట్రస్ట్‌.. పూజారి కోసం దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ దరఖాస్తులో కొన్ని షరుతులు ఉన్నాయి. దరఖాస్తుదారుడి వయసు 20-30 ఏళ్ల మధ్యలో ఉండాలి, గురుకుల విద్య అవసరం, దరఖాస్తుదారుడు శ్రీరాముడి దీక్షకు అర్హత కలిగి ఉండాలి. ఇండియా నుంచి మూడు వేల మంది ధరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఫిల్టర్‌ చేసి 200 మందిని ఇంటర్వూకు సెలెక్ట్‌ చేశారు. ఇంటర్వూకు సెలక్ట్‌ అయిన వాళ్లలో మోహిత్ పాండే కూడా ఉన్నారు. వీళ్లంతా అయోధ్యకు వచ్చారు.

ఇంటర్వూ చేసే ప్యానల్లో హిందూ ప్రవక్త జయకాంత్‌ మిశ్రా, అయోధ్యలోని ప్రముఖులైనా మహింత్‌ మితిలేష్‌, నందిని శరణ్‌, సత్యనారాయణ దాస్‌ ఉన్నారు. వీరందరూ వేదాలను నుంచి ఆరాధాన పద్ధతులపై పూర్తి జ్ఞానం కలిగి ఉన్నారు. అయోధ్యలో 200 మందికి ఇంటర్వూ అయోధ్యలోని విశ్వహిందూపరిషత్‌ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ ఇంటర్వూలో.. శ్రీరాముడికి పూజకు సంబంధించిన ప్రశ్నలు, సంద్యావందనం అంటే ఏంటి, పూజలో చేయాల్సిన మంత్రాలు, పద్దతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఏం మంత్రాలు ఉంటాయి లాంటివన్నీ అడుగారు.. ఈ పరీక్ష అనేది అర్చకత్వంలో యూపీఎస్సీ ఇంటర్వూ లాంటిదే.

200 పూజరాల్లో 21 మంది అర్చకులను ఎంచుకున్నారు. వీరిలో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు, 20 మంది సహాయ అర్చకులను ఎంచుకున్నారు. అందరిలో చర్చకు వస్తున్న పేరు మోహిత్‌ పాండే. 22 ఏళ్ల వయసున్న మోహిత్‌ ప్రధాన అర్చకుడినా నియమించబడ్డాడు అన్న వార్త సంచలనంగా మారింది. ఈ పరీక్షలో మోహిత్‌ తనకంటే ఎంతో పెద్ద పండితులను, ఎంతో అనుభవం ఉన్న పూజారులు ఓడించగలిగాడు. మోహిత్‌ను ప్యానల్‌ మెంబర్స్‌ మాత్రమే కాదు.. సత్యేంద్ర దాస్‌ కూడా ఇష్టపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మోహిత్ పాండే పదేళ్ల వయసులోనే మోహిత్‌ రామాయణం, మహాభారతం లాంటి వేదాలను చదవడం ప్రారంభించాడు. 2020–21 విద్యా సంవత్సరంలో, పాండే ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో తన పదవ తరగతి విద్యను పూర్తి చేసిన తర్వాత SVVU యొక్క BA (శాస్త్రి) ప్రోగ్రామ్‌లో చేరాడు. తిరుపతిలోని వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఆచార్య) డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధమవుతున్నాడు.

మోహిత్‌ దినచర్య:

  • వేదాలు పురణాల గురించి తెలుసుకోవడం తనకు ఇష్టమైనపని
  • సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు..లోకంలో మోహ, మాయల మీద తనకు ఆసక్తి లేదు
  • ముఖం చూడటానికి ప్రకాశవంతంగా ఉంటుంది.
  • సరళమైన ఆహారం తింటాడు
  • సాధారణమైన వస్త్రాలు ధరిస్తాడు.
  • ముఖంపై ఎప్పుడూ బొట్టు ఉంటుంది.. ఈ లక్షణాలన్నీ ఇతర వారితో పోల్చినప్పుడు మోహిత్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.
  • ఇప్పుడు ఆ 21 మంది ఆరునెలల శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో రాముడిని ఏ విధంగా పూజించాలో పూర్తిగా నేర్చుకుంటారు. శిక్షణ పూర్తైన తర్వాత ఆచార్య సత్యేంద్ర దాస్‌ పర్యవేక్షణలో పూజలు ప్రారంభిస్తారు. పాస్‌ అయిన తర్వాత అర్చకులను నియమిస్తారు

మోహిత్ పాండే ప్రధాన అర్చుకుడా.?.

రామ జన్నభూమి తార్ధ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు అయిన కామేశ్వర్‌ చౌపాల్‌ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రాస్‌ మాత్రమే అన్నారు. 21 మందిని ఎంచుకున్నాం. అందులో మోహిత్‌ ఒకడు, శిక్షణ పూర్తైన తర్వాత మాత్రమే వారికి బాధ్యతలు ఇస్తామన్నారు. అంటే మోహిత్ పాండే ప్రధాన అర్చకుడు కాదు.. 21 మందిని ఎంచుకున్నారు. ఆరు నెలల తర్వాత అందులోంచి ఒకరిని ప్రధాన అర్చకులుగా ఎంచుకుంటురాన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news