తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ పండగకు పట్నం నుంచి పల్లెలకు ప్రజలు క్యూ కట్టారు. దీంతో బస్ స్టేషన్లు, బస్సులు జనంతో రద్దీగా మారాయి. బస్టాండ్లలో జనం బస్సు కోసం చూస్తూ బస్సు వచ్చిందంటే చాలు వెంటనే ఎదురెళ్లి కర్చీపులు, బ్యాగులు వేస్తే తప్ప సీటు దొరకని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు అంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నీ బస్టాండులో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సులోని ప్రయాణికులు దిగక ముందే అక్కడ బస్ కోసం వేచి చూస్తున్నా ప్రజలుకిటికీలోంచి బస్సులోకి ఎక్కుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ స్త్రీలు ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సుతో కొంతమంది స్త్రీలకు లాభం వచ్చినప్పటికీ మరి కొంతమందికి బాధలు తప్పడం లేదు. కొన్ని ఆర్టీసీ బస్సులు మహిళలను చూడగానే ఆపకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్ని బాధలు పడినా పట్నం నుంచి సొంత ఊరికి. వచ్చి పండుగ చేసుకుంటే ఆ సంతోషం వేరని నగరం వాసులు అంటున్నారు.