కోడి పందాలు అనగానే ముందు ఉండేది తెలుగు రాష్ట్రాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాలలోను ఈ కోడి పందాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో కూడా కోడి పందాలను ఎక్కువగా వేస్తూ ఉంటారు. దీనితో కోడి పందాల కోసం ఎక్కడి ఎక్కడి నుంచో ప్రజలు తరలి వస్తు ఉంటారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా వచ్చి కోట్ల పందాలు కాస్తూ ఉంటారు. మన తెలుగు నేలపై కోడి పందానికి వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. 11 వ శతాబ్దంలో కోడి పందాలను అప్పటి పల్నాటి రాజులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయినా పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లిపోయాడని చరిత్ర చెప్తుంది.
బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు జోరుగా సాగేవి. వీటిని తమ పరువుగా భావించే వారు రాజులు. కోడి ఓడిపోతే వాళ్ళ పరువు పోయినట్లుగా భావించారు. అయితే ఇప్పుడు వాటి విధానం పూర్తిగా మారిపోయింది. కోట్ల పందాలు కాస్తూ కోడి పందాలను వినోదంగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో రెండు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ ఆరు జిల్లాలు ఈ కోడి పందాలను క్రమంగా నిర్వహిస్తున్నాయి.