కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కి సాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం : కోమటి రెడ్డి

-

నల్లగొండను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామన్నారు.

6 గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. క్యాబినెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ హరి చందన దాసరి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, ఆర్డీవో రవి, తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news