రాష్ట్రంలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి: కోమటిరెడ్డి

-

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సింధియా మాట్లాడుతూ.. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్యా 260 మిలియన్‌లు పెరిగిందని అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

అనంతరం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందని వెల్లడించారు. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం అని పేర్కొన్నారు. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతి భద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news