అయోధ్య బాల రాముడి పేరు మార్పు.. ఇకపై ఈ పేరుతోనే..!

-

శతాబ్దాల సాకారమై అయోధ్యలోని నవ నిర్మిత భవ్య మందిరంలో రామయ్య  కొలువు దీరాడు. ప్రధాని చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుక చూసి భక్త జనం పులకించిపోయింది. అయితే ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రామ్ లల్లాను ఇక నుంచి బాలక్ రామ్ గా పిలువనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు.

Ram Lalla jewellery

జనవరి 22న ప్రతిష్టించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్ రామ్ గా పేరు పెట్టామని.. అయోధ్యలో కొలువురు దీని శ్రీరామ చంద్ర మూర్తి ఐదేళ్ల పసి బాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇక పై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తాం అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య భక్తులకు అనుమతించారు. ప్రాణ ప్రతిష్ట పూర్తి అవ్వడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. రోజుకు 6 సార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్రస్ట్ కి చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని శరణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news