అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలి..!

-

తెలంగాణ లోని రైతుల కి అసైన్ చేసిన ఇరవై ఏళ్లకు అయినా శాశ్వత హక్కులు కల్పించాలని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని అసైన్డ్ భూముల శాశ్వత హక్కుల సాధన సమితి కోరడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. బుధవారం సచివాలయం లో మంత్రిని సమితి ప్రధాన కార్యదర్శి మన్నే నర్సింహా రెడ్డి కలిసారు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రం లో 15 లక్షల రైతు కుటుంబాలకి భరోసా లభిస్తుందని చెప్పారు.

ఆర్థిక సామాజిక భరోసా వాళ్లకు ఉంటుందన్నారు ఎప్పుడైనా అత్యవసరానికి పిల్లలు చదువులు పెళ్ళికి అమ్ముకోడానికి వీలు లేకుండా పోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించినట్లు గానే పూర్తి హక్కులు కల్పించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాలకు ఇరవై ఏళ్ళు, కర్ణాటకలో 15 మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ 10 ఏళ్లు కి శాశ్వత హక్కులు కల్పిస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news