బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక మీద పచ్చి అబద్దాలు చెప్పారు అని కేటీఆర్ అన్నారు. ప్రారంభమే కానీ రైతు భరోసా కార్యక్రమం తో రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ వేదికల పైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెప్తున్నారని, ఇక్కడ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు చెప్తున్నారు అని అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అని అన్నారు. లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కేటీఆర్ అన్నారు. 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం ఒక్కటే అన్నారు. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే అన్నట్టు జరుగుతోంది అని అన్నారు. అలానే ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు.