ముఖ్యమంత్రి పదవీపై సీఎం రేవంత్ రెడ్డి మొదటి సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ పదవీ, హోదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు. కార్యకర్తల కఠోర శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వాళ్లు పెట్టిన బిక్షతోనే ఈ రోజు తాను ఈ స్థానంలో ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ, కర్ణాటకలోకి రావడం వల్ల చాలా ప్లస్ అయిందన్నారు.
ఈ దేశంలో త్యాగం గురించి మాట్లాడే హక్కు ఒక్క నెహ్రు కుటుంబానికే ఉందని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారు దేశం కోసం ప్రాణాలను అర్పించారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న దేశానికి సోనియాగాంధీ స్థిరత్వాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని మంత్రి పదవులు తన వరకు వచ్చినా రాహుల్ గాంధీ తీసుకోలేదన్నారు. 2004లోనే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. కానీ రాహుల్ తీసుకోలేదు.