వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఇండస్ట్రీ మొత్తం చిరుకు అభినందనలు తెలిపారు.ఇక చిరుకు కంగ్రాట్స్ చెప్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అయితే అందులో కూడా చిరును తప్పుగా ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
” శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి నేను ఎప్పుడూ వినలేదు . వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడానికి, నేను అవార్డుతో థ్రిల్‌గా లేను, అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి సంతోషంగా ఉంది అంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను” అని రాసుకొచ్చాడు. ఇక చిరు ట్విట్టర్ @kchirutweets కి బదులు @chirutweets అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.