నాకు జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడం తప్పు అంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అయితే వైఎస్ షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితి నెలకొంది.
వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఆమె వైసిపి పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సమావేశమయ్యారు.
అనంతరం ఇద్దరూ కలిసి ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. కాగా, తన తండ్రి హత్య కేసు పై సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తో పాటు పలువురుని సిబిఐ నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.