కేసీఆర్ కుటుంబంకి అహంకారం ఎక్కువ : కిషన్ రెడ్డి

-

ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోందని తమకి ముందే తెలుసని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హయత్ నగర్ ఎస్వీ కన్వెన్షన్ లో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ముద్రా యోజన లోన్లు,మహిళా రుణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతు ….కాంగ్రెస్ హయాంలో అనేక స్కాంలు జరిగాయి అని విమర్శించారు. ఆ కుంభకోణాల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు అని ఆయన తెలిపారు.

ప్రధాని మోడిని విమర్శించే ధైర్యం అపోజిషన్ పార్టీలకి లేదు. కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుందని ,దేశంలో ఏ నాయకులు కేసీఆర్ ఫ్యామిలీ మాదిరిగా మాట్లాడరు అని అన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. గత కేసీఆర్ ప్రభుత్వం వలన తెలంగాణ 7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్ళింది.. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news