BREAKING : పంజాగుట్ట పీఎస్‌లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన సీపీ శ్రీనివాస్‌రెడ్డి

-

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్‌ఐ నుంచి హోంగార్డు వరకు 85 మంది బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కొత్తగా 82 మందిని నియమించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

గత కొంతకాలంగా పంజాగుట్ట ఠాణా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు పొందిన ఈ పీఎస్ను ఈ మధ్య తరచూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. నెలరోజుల క్రితం డ్రంకన్‌డ్రైవ్‌ కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవటం సంచలనంగా మారింది. ఆ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ తప్పించుకోవడం, దానికి పంజాగుట్ట సీఐ దుర్గారావు సహకరించడంతో ఈ ఠాణా మరింత అభాసుపాలైంది. ఇలా పలు వివాదాలతో చర్చనీయాంశమైన ఈ పీఎస్ తాజాగా సీపీ సంచలన నిర్ణయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news