సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపులు, గత ప్రభుత్వ వాదనలు, కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల వివరాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై వాస్తవాలను బయటపెట్టాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ కేబినేట్ సమావేశానికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్ పథకాలపై చర్చించనుంది కేబినేట్. అలాగే… బడ్జెట్ సమావేశాలపై ఇవాళ్టి తెలంగాణ కేబినేట్ సమావేశంలో చర్చించనున్నారు.