బీజేపీ నేతల కాళ్లు టీడీపీ మొక్కలేదు..అవన్నీ ఫేక్‌ పోస్టులు – అచ్చెన్నాయుడు

-

బీజేపీ నేతల కాళ్లు టీడీపీ మొక్కలేదు..అవన్నీ ఫేక్‌ పోస్టులు అంటూ టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. అమిత్‌షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని తెలిపారు. బీజేపీ నేతల కాళ్లు మొక్కడం వైసీపీ సంస్కృతి, టీడీపీకి అవసరం లేదు.. వైసీపీ ఫేక్‌ పోస్టులను వదిలిపెట్టమని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లుగా ఆశాలతో జగన్ రెడ్డి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహించారు.ఆదాయ పరిమితి నిబంధనతో ఆశాలను సంక్షేమానికి దూరం చేశారు….శెలవులివ్వకుండా, పని భారంతో ఒత్తిడి పెంచడం అమానుషం కాదా? అంటూ నిప్పులు చెరిగారు.ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే నిరసన తెలిపడం నేరమెలా అవుతుంది? అన్నారు. తక్షణమే ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, పనిభారం తగ్గించాలని కోరారు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news