బీఏసీ సమావేశం నుంచి బయటకి రావడం పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తాజాగా క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ అనుమతితోనే బీజేసీకి వెళ్లానన్నారు. బీఏసీకి వెళ్లడం పై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారని పేర్కొన్నారు. వారు అభ్యంతరం తెలపడంతో వారి విజ్ఞతకు వదిలేసి బయటికి వచ్చేశానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కనీసం మంత్రులు కూడా వెళ్లడం లేదన్నారు.
ఆరు గ్యారెంటీలలో రెండు అమలు చేశామని.. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు. ఆరోగ్య శ్రీ గురించి గవర్నర్ తో ఎందుకు చెప్పించలేదన్నారు. ఆశగా ఎదురుచూసినా ఆసరా ఫించన్ దారులకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందన్నారు. మహాలక్ష్మీ కింద మహిళలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయం పై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ పై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు హరీశ్ రావు.