మేడిగడ్డ ఇష్యూలో కీలక పరిణామం.. తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్ట్ ని తిరస్కరించిన హైకోర్టు..!

-

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్నయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీ ఇస్యూ పై జ్యూడిషియల్ పై ఎంక్వయిరీ జరిపించేందుకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిట్టింగ్ జడ్జీని కేటాయించాలనే ప్రభుత్వ రిక్వెస్ట్ ను హైకోర్టు తిరస్కరించినట్టు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జ్యుడిషియల్ ఎంక్వయిరీకి సిట్టింగ్ జడ్జీని ఇవ్వాలని కోరామని.. కానీ సిట్టింగ్ జడ్జీని ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సిట్టింగ్ జడ్జీకి బదులు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలా వద్ద అనేది కేబినెట్ భేటీలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news