MP Elections: తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయనున్న బీజేపీ

-

MP Elections: తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయనుంది బీజేపీ. ఇదేవిషయాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా బండి సంజయ్‌ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ…కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు బీజెపీ పై కుట్రలు చేస్తున్నాయని…ప్రతి సారి ఎన్నికలు రాగానే రెండు పార్టీలు ఒక్కటే అవుతాయి, పై పైకి తిట్టుకుంటారన్నారు.

BJP will contest alone in Telangana

కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని పెట్టలేదు, కేవలం బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా ఉండడానికే కాంగ్రెస్ చేస్తుందని…మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజెపీ,బీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీని బదనాం చేయడానికే కుట్ర చేస్తున్నారు… బీబీపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సర్వేలు వచ్చాయని వివరించారు. మాకు బీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకునే అవసరం లేదని…మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామన్నారు. ఏ పార్టీ తో పొత్తు ఉండదు, ప్రజలు గమనించాలని కోరారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ లు కలిసి పోటీ చేశాయని..పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ఒక్క ఎంపీ సీటు రాదని బాంబ్‌ పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news