ఇకపై పాఠశాలల్లో వాటర్‌ బ్రేక్‌.. కేరళ ప్రభుత్వం నిర్ణయం

-

ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా తగినంత నీరు అందించేలా చూడాలన్న లక్ష్యంతో ‘వాటర్ బెల్’ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో ఈ నెల 20 నుంచి ‘వాటర్ బెల్’ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది.

ఈ విధానాన్ని కేరళలోని కొన్ని పాఠశాలల్లో 2019లో దేశంలో మొదటిసారి ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం వెల్లడించింది. అనంతరం ఈ విధానాన్ని తెలంగాణ ,కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలుచేశాయని తెల్పింది.ఇకపై ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుల్లో అమలు చేయాలని చూస్తుంది.ఉ.10.30కి, మ. 12.30గంటలకు 5ని.ల చొప్పున ఈ బ్రేక్ ఉంటుంది.పిల్లల్లో డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news