‘సరిపోదా శనివారం’ నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ . ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్ ఉండబోతోందని ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్రీట్ ఏమైఉంటుందా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే శనివారం నాని పుట్టినరోజు కావడంతో.. టీజర్ విడుదల చేసి మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్  ఆసక్తిని రేకెత్తిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news