తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం లాల్ సలాం.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించారు.
ఈ నెల ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .అయితే ఈ సినిమాకు రజనీ కెరీర్‌లోనే ఊహించని విధంగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్‌కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో లాల్ సలామ్ సినిమాని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.లాల్ సలామ్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త తెగ వైరల్ అవుతుంది.కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.