ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడుత అభ్యర్థులను ప్రకటించారు. తొలుత కేవలం ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. అయితే అందులో ప్రస్తుతానకి ఐదు స్థానాల అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేసింది. వీరిలో తెనాలి- నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కోణతాల రామకృష్ణ, రాజానగరం-బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీలను ప్రకటించారు.
మిగిలిన 19 మంది అభ్యర్థులను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ అరాచక పాలనను గద్దె దించేందుకు తాము సిద్ధం అయ్యాయని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తు పెట్టుకున్నట్టు మరోసారి చెప్పుకొచ్చారు. తాము అసెంబ్లీతో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. మిగిలిన చోట్ల గెలుపు గుర్రాలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది.