శివుడి దగ్గరే కేసీఆర్ ఆ తప్పులన్నీ ఒప్పుకోవాలి : ఎమ్మెల్యే మక్కన్ సింగ్

-

బీఆర్ఎస్ పార్టీ మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీట్ ఎక్కింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మేడిగడ్డ ఇష్యూపై డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డను స్వాగతిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ను కూడా తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం శివుడి దగ్గరే కేసీఆర్ తమ తప్పులు అన్ని ఒప్పుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎందరో రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ కాళేశ్వరం లాభాలు మాత్రం ఒక్క కేసీఆర్ కుటుంబమే తీసుకుందని విమర్శించారు. కాగా, కాళ్వేశరం ప్రాజెక్ట్ భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. అప్పటి బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలే వల్లే మేడిగడ్డ మూడేళ్లకు కుంగిపోయిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఎమ్మెల్యేందరిని కాళేశ్వరం పర్యటనకు తీసుకెళ్లి మేడిగడ్డ డ్యామేజీని ప్రత్యక్షంగా వాళ్లుకు చూపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news