జగన్ కు కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తాం- చంద్రబాబు

-

జగన్ పులివెందుల రాజకీయాలు, పంచాయతీలు ,చేస్తే కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తామంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోవడానికి జగన్ సిద్ధమని.. జగన్ సీట్లు ఇస్తానంటే వద్దని నాయకులు రాజీనామాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఎంపీలు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసిపి నుంచి వెళ్ళిపోతున్నారు….పల్నాడును అభివృద్ధి చేసే బాధ్యత టిడిపి జనసేనల ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు చంద్రబాబు. వరికి పుడిసెల ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత మాదన్నారు.

పల్నాడులో ఈ ప్రభుత్వం చేసిన ఒక పని చెప్పాలి.. రోడ్లు వేశారా, నీళ్ళిచ్చారా? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. పల్నాడు కి వస్తే నా మనసు ఆవేదనతో నిండిపోతుంది…స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ను మానసికంగా వేధించి ప్రాణాలు తీశారని ఆరోపణలు చేశారు. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య లాంటి కార్యకర్తల మరణాలను, హత్యలను నేను ఎప్పటికీ మర్చిపోనని వివరించారు. రెంటచింతల మండలం మల్లవరం లో ఓ ఎస్టీ మహిళ మంచినీళ్లు అడిగితే టాంకర్ తో గుద్ది చంపేశారు…ఇలాంటి హత్య లు మర్చిపోతానా అంటూ ఫైర్‌ అయయారు.

Read more RELATED
Recommended to you

Latest news