పాతబస్తీ మెట్రోకు 8న శంకుస్థాపన

-

హైదరాబాద్‌ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఓల్డ్ సిటీలో మెట్రో రైలు కూత పెట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్ పాతబస్తీ వాసుల కల నెరవేరబోతోంది. ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలుమార్గాన్ని నిర్మించనున్నారు. ఈ మెట్రో రైలుకు రూ.2,000 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు.

ఈ మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. పనులను వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదటి దశలోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికీ ప్రయత్నాలు జరిగినా ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో దీనికి బ్రేక్ పడింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాతబస్తీకి మెట్రోరైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news