భారత్‌తో దౌత్యవివాదం వేళ భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌తో దౌత్యవివాదం వేళ భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. భారత్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందని నషీద్ అన్నారు. ఈ పరిణామాలతో తాను ఆందోళన చెందానని, దీనిపై మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. ఈ సెలవులకు భారతీయులు తమ దేశం రావాలని కోరుకుంటున్నామన్న నషీద్.. ఎప్పటిలాగే తమ ఆతిథ్యం ఉంటుందని.. దానిలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు.
భారత దళాలు మాల్దీవులు విడిచి వెళ్లాలని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కోరినప్పుడు భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదు నషీద్ అన్నారు. ‘సరే, చర్చిద్దాం’ అంటూ భారత్ సంయమనం పాటించింది’’ అని నషీద్ కొనియాడారు.