తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హీట్ మొదలైంది.. బిజెపి ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది.. అయితే కొన్ని నియోజకవర్గాలలో మాత్రం పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులను ఖరారు చేయలేదు.. వాటిలో ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సీట్ పై పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మహబూబ్నగర్ బిజెపి బాద్షా ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొంది..
మహబూబ్నగర్ ఎంపీ సీటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మొదటి లిస్టులో ఎవరు పేరు రాకపోవడంతో.. ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీటు తమకే వస్తుందంటూ డీకే అరుణ ఒకవైపు.. జితేందర్ రెడ్డి మరోవైపు తమను చీరలకు చెబుతున్నారట.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాలకు సైతం ఇద్దరు నేతలు సిద్ధమవుతున్నారట. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు గా ఉన్న డీకే అరుణకు మొదటి లిస్టులోనే సీటు కన్ఫామ్ అవుతుందని అందరూ భావించారు.. ఎంపీ సీటు కోసం అసెంబ్లీ సీట్ ను సైతం త్యాగం చేసిన అరుణ పేరు మొదటి లిస్టులో లేకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మొదటి జాబితా విడుదలైన వెంటనే ఆమె రాష్ట్ర పెద్దలతో పాటు.. జాతీయస్థాయిలో ఉండే ముఖ్య నేతలతో మాట్లాడారట.. వారు అబ్బాయి హస్తం ఇవ్వడంతో ఆమె ధీమాగా ఉన్నారని డీకే అరుణ అనుచరులు చెబుతున్నారు. మరోపక్క జితేందర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. డీకే అరుణ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జితేందర్ రెడ్డి.. ఎంపీ టికెట్ పై కన్నేసారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని.. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని ఆయన అనుచరుల వద్ద చాలా నమ్మకంగా చెబుతున్నారు.. ఎవరికి వారు కాన్ఫిడెంట్గా ప్రచారాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ ఎంపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది..