బంగారం విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డిమాండ్ ఇలా కొన్ని కొన్ని కారణాలతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. దీనితో భవిష్యత్తులో మరింత బంగారం ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న భారతీయులు బంగారం కొనుగోలు చేసుకుని జాగ్రత్త పడుతున్నారు. అవసరమైతే ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. చిన్న చిన్న ఆదాయం ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బంగారం కొనుగోలు విషయంలో ముందు చూపు ప్రదర్శిస్తున్నారు.
అసలు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఏ విధమైన కనీస జాగ్రత్తలు తీసుకోవాలి…? కొంత మంది డబ్బులు ఉన్నాయి కదా అని 20 వేలు, 15 వేలు, 25 వేలు… పెట్టి ఉంగరాలు, పోగులు వంటివి కోనేస్తూ ఉంటారు. దీని వలన చాలా నష్టపోతారని అంటున్నారు… కారణం… భవిష్యత్తులో మీరు ఆ బంగారాన్ని అమ్మాలి అంటే ఆ పన్ను, ఈ చార్జీలు అని చెప్పి… మూడు నుంచి 4 వేల వరకు కోత వేస్తారు. ఉదాహరణకు 17 వేలు ఖర్చు చేసి మీరు ఒక ఉంగరాన్ని కొనుగోలు చేస్తే… దాన్ని ఒక రెండేళ్ళ తర్వాత మీరు విక్రయిస్తే ఎంత ధర పెరిగినా సరే…
మీకు 14 వేల లోపే వస్తుంది… దీనితో మీరు నష్టపోతారు. ఇక వజ్రాలకు సంబంధించిన బంగారం కూడా కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది అంటున్నారు… వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఏం కాదు గాని భవిష్యత్తులో అది పోతే మాత్రం… దాన్ని ఎక్కడా కొనుగోలు చేయరు… ఒకవేళ చేసినా సరే… ఆ వజ్రం ఖరీదు తీసేస్తూ ఉంటారు. ఇక దాన్ని తాకట్టు సంస్థల్లో పెట్టడం కూడా కష్టం. కాబట్టి బంగారం కొనే ముందు డబ్బులు ఉన్నాయి కదా అని ఆవేశ పడకుండా జాగ్రత్తగా కొనుక్కోవాలని సూచిస్తున్నారు. 50 వేల పై ధరలోనే కొనుగోలు చేయమని సూచిస్తున్నారు.