ఇంత చేతకానీ ప్రభుత్వాన్ని చూడలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఫైర్

-

నిరుద్యోగ నేత అశోక్ నిరాహార దీక్షకు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని అశోక్ కుమార్ తన నివాసంలో మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ.. చైతన్యపురిలోని అశోక్ నివాసానికి వెళ్లారు. దీక్షలో ఉన్న అశోక్ కుమార్ తో మాట్లాడి, ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈయనతో పాటు బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న అశోక్ కుమార్ ను ఒక తీవ్ర వాదిలాగా, ఉగ్రవాదిలాగా నిర్భందం చేశారని మండిపడ్డారు.

ఆయనను ఇంట్లో నుండి బయటకి వెళ్లకుండా చేసినందుకు ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజ్యాంగం ఆర్టికల్-19 ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛని ఇచ్చిందని, దాని ప్రకారం 35 లక్షల నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్న కారణంతో ఇలా చేయడం సరికాదన్నారు. 9,200 గురుకుల పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నా కేవలం 3200 పోస్టులు ఇచ్చారని, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని చూడలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవాళ నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా.. ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా పత్రాలు పంచామని చూపించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news