తెలంగాణ పోలీసులకు కేసీఆర్ వార్నింగ్… ఏది శాశ్వతం కాదు !

-

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు రాజకీయాలతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని ఆయన అన్నారు.మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మామీద కూడా కుక్కలు మొరిగినయ్.. ఎవడి పాపాన వాడు పోతాడు అన్నం కానీ ఈ దౌర్జన్యాలు చేయలేదు అని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే యావత్ దేశాన్ని చైతన్యం చేసేవాడినని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సభలో అన్నారు. ‘మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈపాటికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని అని ,చిచ్చు అంటించేవాడిని అన్నారు. మొత్తం దేశాన్నే చైతన్యం చేసి ఉండేవాడిని. చిన్న దెబ్బ తగిలింది సరే ఓర్చుకుందాం …తట్టుకుందాం అని తెలిపారు. ఉద్యమాలు చేసినోళ్లం. ఓపిక ఉన్నోళ్లం. ధైర్యంగా ముందుకు పోవాలి’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news