మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్త అందించారు.రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే పథకానికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ‘6.10 లక్షల స్వయం సహాయక సంఘాలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు. 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని పేర్కొన్నారు. ఈ రుణాలకు ఈ ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. 10 సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందలేదు అని గుర్తు చేశారు. ప్రతి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోంది’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

‘కేసీఆర్ అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాలు మహిళలను మోసం చేశారు అని ఆరోపించారు. మహిళల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదు అని మండిపడ్డారు .గ్యాస్ ధర పెంచి దోచుకున్నారు అని, రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి నా నెత్తిన పెట్టారు అని తీవ్ర విమర్శలు చేశారు .ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిని మహిళలు చీపుళ్లతో కొట్టండి’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news