Hyderabad : పొత్తులో భాగంగా బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించిన బీఆర్ఎస్ పార్టీ…..

-

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తో బిఎస్పీ పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీ కి కేటాయించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.అందులో భాగంగా.. నాగర్ కర్నూల్ ,హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.కాగా…సంబంధిత రెండు స్థానాల్లో అభ్యర్థులను బీఎస్పీ ఖరారు చేసుకోనున్నది.

 

కాగా,కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవిత,మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య,మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మా రెడ్డి, అదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఆత్రం సక్కును కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news