రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం.. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్ధం..

-

వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలనాత్మక స్టేట్మెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు.. పవన్ కళ్యాణ్ తన అభిమాన నటుడు అంటూనే.. ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించే రాంగోపాల్ వర్మ.. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు మరో జలక్కిచ్చారు.. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే.. పిఠాపురం నుంచి తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు.. ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం అని.. పిఠాపురం నుంచి పోటీ చేయడానికి తాను ఆస్వాదిస్తానని వెల్లడించారు.. సినిమా డైరెక్టర్ గా.. మనసులో ఉన్న మాటని సూటిగా చెప్పే దర్శకునిగా రాంగోపాల్ వర్మకు పేరు ఉంది.. నిత్యం వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా ఉంటారు..

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని పొగుడుతూనే.. ఆయనపై సెటైర్లు పేలుస్తూ ఉంటారు.. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీపై కూడా సీరియస్ కామెంట్స్ చేసినా రాంగోపాల్ వర్మ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట… వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిపాలైన పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు కార్యకర్తల సమావేశంలో వివరించారు.. పవన్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే రామ్ గోపాల్ వర్మ సైతం తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ కు కౌంటర్ హా..? లేక నిజంగా ఆయన పోటీలో ఉంటారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని ప్రకటించిన అనంతరం పలువురు వైసీపీ నేతలు, ఆర్జీవి అభిమానులు పాజిటివ్ గా స్పందించారు.. ఆర్జీవి పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తారని… తామంతా ప్రచారం చేస్తామని ఆయన అభిమానులు చెబుతున్నారు.. ఇంతకీ నిజంగా వర్మ పోటీ చేస్తారో లేదో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news