తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. నంది నగర్ లోని నివాసంలో కేసీఆర్ తో సమావేశం అయిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు.
బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. రాబోయే పార్లమెంట్ ఎన్నిక్లలో ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ ట్వీట్ చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పత్తు ఉండదని అలాగే మరో ఇతర పార్టీతోనూ పొత్తు లేదన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ 17 ఎంపీ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నది క్లారిటీ
ఇచ్చారు.