అజ్ఞాతంలో మెగా హీరో…. ఏమయ్యాడంటూ బెంబేలెత్తుతున్న ఫ్యాన్స్….!!

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో మూడవ సారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి బన్నీ నటిస్తున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ బయటకు వచ్చి శ్రోతలను ఎంతో అలరించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది.

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం బన్నీ, సుకుమార్ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం బన్నీ ఒక సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడట.

 

కావున ఆ లుక్ కోసం ఆయన ఇకపై దాదాపుగా ఒక నెల రోజుల వరకు ఫ్యాన్స్ కు కానీ తన సన్నిహితులకు గాని కనపడడని తెలుస్తోంది. అయితే బన్నీ ఏమయ్యాడంటూ ఆయన ఫ్యాన్స్ కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ నెల రోజుల్లోపు అలవైకుంఠపురములో ప్రమోషన్స్ కూడా పూర్తయిపోతాయని, అలానే మధ్యలో సుకుమార్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ పాల్గొంటాడని అంటున్నారు. ఇక మరొక నెల తరువాత జరిగే అలవైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే బన్నీ తన అభిమానులకు పునః దర్శనం ఇవ్వనున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి…….!!

Read more RELATED
Recommended to you

Latest news