పార్టీ మారిన దానం నాగేందర్ మీద అనర్హత వేటు ?

-

పార్టీ మారిన దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్… వెళ్లారు. అయితే ఫిర్యాదు పత్రంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో స్పీకర్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వలేదు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

ఇది ఇలా ఉండగా,తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటించిన గంట వ్యవధిలో ఆయన ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఈ ఇరువురు నేతలు హస్తం కండువా కప్పుకున్నారు.అంతకుముందు రంజిత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు రంజిత్‌ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news