తిరుమలలో ఉత్తరద్వారం దర్శనం.. ఇకపై 10 రోజులు!

-

(తిరుమలలో మొట్టమొదటిసారి 10 రోజుల ఉత్తర ద్వారా దర్శనం)
మార్గశిర మాసం దీనిలోనే పవిత్ర మార్గళి అంటే ధనుర్‌మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే పవిత్ర పండుగ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ రోజు విష్ణుఆలయాల్లో భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలో కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో భక్తుల రద్దీ చెప్పలేనంత. చాలామందికి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కాక తిరిగి పోతారు. భక్తులందరికీ ఉత్తర ద్వారా దర్శనం చేయడానికి టీటీడీ ఆగమ మండలి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టంది. వివరాలు… తిరుమలలో శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలంటే కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే సాధ్యమవుతుంది.

స్వామిని వైకుంఠద్వారం నుంచి దర్శించుకోడానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర ద్వారాలను ఏడాదికి 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేసినట్టు భోగట్టా. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి సూచనలతో నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. పాలక మండలి నిర్ణయం లాంఛనమేనని పేర్కొంటున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. ఈ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి అంగీకరించింది. ఒకవేళ పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. వైకుంఠ ఏకాదశి పర్యదినాన దాదాపు రెండు లక్షల మందికి ఉత్తరద్వారం ద్వారా దర్శనభాగ్యం కలుగుతుంది. ఈ అవకాశాన్ని మరింత మందికి కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

శ్రీరంగంలో ఇప్పటికే ఈ విధానం!!

శ్రీరంగం ఆలయంలోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తున్నారు. అక్కడ ఉత్తర ద్వారాలను 10 రోజులు తెరిచే ఉంచుతారు. దీని గుండా భక్తులకు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. వచ్చే జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం 10 రోజులు తెరవనున్నారని సమాచారం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news