కంగనాకు భారీ షాక్ ఇచ్చిన రమ్య కృష్ణ ‘క్వీన్’….!!

-

ప్రస్తుతం మన దేశంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మన తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలుగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు, అలానే సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తమిళనాట పురిచ్చి తలైవిగా పేరుగాంచిన ఐరన్ లేడీ దివంగత జయలలిత బయోపిక్ లు గా మొత్తం మూడు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో కంగనా రనావత్ నటిస్తున్న ‘తలైవి’ తో పాటు రమ్యకృష్ణ నటిస్తున్న ‘క్వీన్’, అలానే నిత్యామీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ సినిమాలు ఉన్నాయి.

కాగా వాటిలో తలైవి మరియు ఐరన్ లేడీ సినిమాలు కాగా, క్వీన్ మాత్ర్రం వెబ్ సిరీస్ గా రాబోతోంది. ఇక నేడు క్వీన్ వెబ్ సిరీస్ తాలూకు ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సంచలనం సృష్టిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, ఈ సినిమాలో జయ పాత్రలో కనపడనున్నారు. జయలలిత బాల్యం మొదలుకుని, ఆ తరువాత సినిమాల్లోకి రంగప్రవేశం, అనంతరం హీరోయిన్ గా మంచి పేరుతో ఎదగడం, ఆపై ఎంజీఆర్ తో పరిచయం, ఆ తరువాత అన్నాడీఎంకే పార్టీలో చేరి, ఎంజీయార్ మరణం తరువాత ఆ పార్టీకి అధినేత్రిగా,

 

అలానే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇలా పలు దశాల్లోని ఆమె జీవితాన్ని మొత్తం 14 భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, తన మిత్రుడైన మురుగేశన్ తో కలిసి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల కంగనా రనవత్ నటిస్తున్న తలైవి ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి పేరు దక్కించుకుంది. అయితే తలైవి కంటే క్వీన్ టీజరే బాగుందని పలువురు ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. కాగా ఈ క్వీన్ వెబ్ సిరీస్ ఈనెల 14 నుండి పలు భాషల  ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది….!!

Read more RELATED
Recommended to you

Latest news