ఆ డైరెక్ట‌ర్‌కు మ‌రో సారి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మ‌హేష్ బాబు..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తు ఈ చిత్రంలో ర‌ష్మిక మందన హీరోయిన్‌గా న‌టిస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాబు మ‌రో సారి వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో మ‌హేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. పక్కా మెసేజ్ తో, తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్నే అందుకుంది.

అయితే గ‌త కొద్ది రోజులుగా మ‌హ‌ర్షి కాంబినేష‌న్ మ‌ళ్ళీ రిపీట్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపైన తాజాగా వంశీ పైడిప‌ల్లి స్పందించారు. మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ . ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు వంశీ. త్వరలో ఈ సినిమా పైన ఆఫీషల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news