టార్గెట్ మేఘా… వయా ఇద్దరు ముఖ్యమంత్రులు…!

-

మేఘా కృష్ణా రెడ్డి… అంచెలు అంచెలు గా ఎదిగిన మహా వ్యాపారవేత్త… పైపుల కంపెనీ తయారి నుంచి ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన కంపెనీగా పనులు చేసే వరకు ఎదిగారు. ఫోర్బ్స్ జాబితాలో 39 వ స్థానం సంపాదించి ఆశ్చర్యపరిచారు. అక్కడి నుంచి నేడు… రాజకీయ నాయకులు, ప్రభుత్వాల అధినేతల వరకు ఆయన పలుకుబడి వరకు వెళ్ళింది… ఆయన మీద ఐటి దాడులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి అంటూ కథనాలు వచ్చాయి అంటే ఆయన ఏ స్థాయి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు.

అవును సాదా సీదాగా కనపడే మెగా కృష్ణా రెడ్డి చుట్టు నేడు రాజకీయాలు తిరుగుతున్నాయి అంటే ఆయన ఏ స్థాయికి ఎదిగారో అర్ధమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఒక పేపర్ క్లిప్ లో ఉన్న సారాంశం ఆధారంగా ఆయన చుట్టు అనేక అనుమాన కోణాలు తిరుగుతున్నాయి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎన్నడు లేని విధంగా ఆదా పేరుతో మొదలు పెట్టిన కార్యక్రమమే ఆయన కోసమని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. గత ఏడాది జరిగిన ఒక దక్షిణాది రాష్ట్ర ఎన్నికల్లో, ఆయన గారు ఒక పార్టీ అధినేతకు మూడు వేల కోట్లకు పైగా విరాళం ఇచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. అది కూడా బ్యాంకుల ద్వారా ఆయన ఇచ్చారని, రాయలసీమకు చెందిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఈ ఏడాది ఎన్నికల్లో ఆయన నుంచి డబ్బులు వెళ్ళాయి అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయనపై ఐటి దాడులు జరిగాయి. ఈ ఐటి దాడుల్లో ఈ మూడు వేల కోట్లకు సంబంధించి అధికారులకు ఏ లెక్కా కనపడలేదు. అది లిక్విడ్ క్యాష్ ద్వారా చెల్లించారని అధికారులు గుర్తించారు.

ఇద్దరు దక్షిణాది మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన వద్ద పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి మేఘా ఒప్పందం చేసుకుంది. దీని వెనుక కూడా బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని, ఆయన కోసమే అసలు ఒక ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, దక్షిణాదికి చెందిన ఒక  జలవనరుల శాఖా మాజీమంత్రి దీనిలో సహాయం చేసారని అంటున్నారు. సోషల్ మీడియాకు పరిమితం అయిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎంత వరకు నిజమో గాని, తేడా వస్తే మాత్రం సంచలనమే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news