తిరుపతిలో రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నగర వనాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర వనంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటారు. పట్టణ ప్రాంత ప్రజలకు అహ్లాదకరమైన రాశివనం, యోగా కేంద్రంతో పాటు పిల్లల పార్క్‌ని ఏర్పాటు చేశారు..
తిరుపతిలో పర్యటన ముగిన అనంతరం శనివారం సాయంత్రం చంద్రబాబు బృందం హైదరాబాద్‌కు చేరి అక్కడి నుండి అమెరికాకు బయలుదేరనున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.