అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిట్ట.. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని గతంలో ఎన్నోసార్లు రుజువైంది.. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు.. ఎన్నో కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు.. అప్పట్లో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో చేతులు కలిపి.. జగన్మోహన్ రెడ్డిని అకారణంగా జైలుకు పంపారు.. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూ ఉండడంతో.. తమ పార్టీ ఉనికి కోల్పోతున్న క్రమంలో చంద్రబాబు మరో భారీ కుట్రకు తెర లేపారు. తెర వెనుక కాంగ్రెస్ తో.. తెర ముందు బిజెపి జనసేనతో ఆయన పొత్తు పెట్టుకుని.. జగన్ని ఎదురుకోవాలని నిర్ణయించుకున్నారు..
కేసుల కోసం బిజెపితో…
రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమనే సర్వేలు చెబుతున్నాయి .. దీంతో చంద్రబాబుకు వెన్నులో వణుకు మొదలైంది. ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు పెట్టుకోవాలని.. వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు.. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా.. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది.. మరో పక్క ఏపీలో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో.. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.. కేంద్రంలో బిజెపి, ఏపీలో జనసేన సహకారంతో అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబుకు.. పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.. దీంతో రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారని జాతీయ ఛానల్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి.. ఏపీలో చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు ఫాలో అవడానికి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు సీఎం రమేష్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు పక్కా ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
చంద్రబాబు ఉచ్చులో షర్మిల, సునీత..
తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్న షర్మిలను తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ట్రాప్ చేయించారట.. షర్మిల స్థాపించిన పార్టీని విలీనం చేయించి.. ఏపీకి తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరుగుతుంది.. నిధులు అందిన తర్వాతే షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనమైందని, ఏపీపీసీసీగా నియామకం జరిగిందని రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది.. సీఎం జగన్ టార్గెట్ గా షర్మిల చేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారట.. దానికి వైఎస్ సునీత కూడా తోడు అయింది.. ఇప్పుడు షర్మిల చేత కడపలో కూడా చంద్రబాబు నాయుడే పోటీ చేయిస్తున్నారని ప్రచారం నడుస్తోంది.. వెన్నుపోటు రాజకీయాలకి కేరాఫ్ గా ఉన్న చంద్రబాబును నమ్మి షర్మిల రాజకీయ చదరంగంలో పావుగా మారిందని కాంగ్రెస్ పాతతరం నేతలు విమర్శిస్తున్నారు..
కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ద్వారా 30 కోట్లు..??
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరు కాదని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిరూపించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడని.. మరోసారి స్పష్టమైన ఆధారాలతో బట్టబయలైంది.. ఎలక్ట్రోలర్ బాండ్ల ద్వారా కాంగ్రెస్కు 30 కోట్లు చంద్రబాబు నాయుడు అప్ప చెప్పినట్లు.. అది కూడా బిజెపిలో ఉన్న తన శిష్యుడు సీఎం రమేష్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి.. అధికారకంగానే 30 కోట్ల అప్పజెప్పిన బాబు.. అనధికారకంగా ఎన్ని కోట్లు కాంగ్రెస్కు షర్మిలకు ఇచ్చారన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించిన సీఎం రమేష్.. తక్కువ టైంలోనే చంద్రబాబు సహకారంతో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించాడు. సొంత విమానం కొనే స్థాయికి చేరారంటే అతను ఏ స్థాయిలో అక్రమాలు చేసి ఉంటారా అనేది అర్థం చేసుకోవచ్చు.. సీఎం రమేష్ బిజెపిలో ఉన్నా.. నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషే అని మరోసారి ఈ డీల్ ద్వారా స్పష్టమైనది.. 2023లో సీఎం రమేష్ 45 కోట్ల మేర ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి.. 30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి, ఐదు కోట్ల టిడిపి ఖాతాలోకి, 10 కోట్లు కర్ణాటకకు చెందిన జెడిఎస్లోకి పంపినట్లు ఆధారాలు బయటపడ్డాయి..
వైఎస్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు..
వైయస్ వివేకానంద ని హత్య చేయించారని చంద్రబాబుపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.. వాటిని బయటపడనివ్వకుండా వివేక హత్య కేసును అడ్డం పెట్టుకుని, సునీతను చేరదీశారు చంద్రబాబు. వివేక హత్య కేసులో తన భర్త జోక్యం ఉండడంతో సునీత కూడా చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు ఫాలో అవుతోంది. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు.. దీంతో జగన్ ఫ్యామిలీలో చీలిక తీసుకువచ్చి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు కుట్రలు చేశారని ఇస్కాం ద్వారా బయటపడింది.. మొత్తంగా పుట్టలకు వెన్నుపోట్లకు చంద్రబాబు నాయుడు కేరాఫ్ అడ్రస్ అని మరోసారి రుజువైందని చంద్రబాబు వ్యక్తిత్వం తెలిసినవారు చెబుతున్నారు..