మరోసారి మహువా మొయిత్రా కి ఈడీ నోటీసులు..!

-

పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ అభ్యర్థి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్సనల్ (ఎన్ఎస్ఈ), అకౌంట్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు.

గత ఏడాది మహువా మెయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. అంతేకాదు.. డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరపున పార్లమెంట్లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. తాజాగా, పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్సైట్ లాగిన్ వివరాలను దర్శన్ హీరానందానికి షేర్ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news