వరంగల్, ఖమ్మం కాంగ్రెస్ సీట్లపై క్లారిటీ వచ్చేసింది!

-

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో రెండు నియోజకవర్గాల విషయంలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కడియం కావ్య, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి కుమార్తె. ఇటీవలే వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ పొందిన ఆమె.. తాజాగా మనసు మార్చుకుని పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక తాజాగా కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో వరంగల్ టికెట్ను ఆమెకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి విషయంలో ముఖ్యనాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా పార్టీ హైకమాండ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మాజీ ఎంపీ ఆర్‌.సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని ఖమ్మం బరిలోకి దింపాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news