‘మేము కాపురం చేసుకుంటే ఎమ్మెల్యేలు ఆపుతారా..? సీఎం రేవంత్ రెడ్డి భార్యభర్తలను కాపురం చేసుకోవద్దని చెబుతారా..? పెళ్లైన మూడో రోజు నుంచి నా భర్త నా పక్కలోకి రావడం లేదు.. దీనిపై ప్రశ్నిస్తే నాకు ఆ నాయకుడు తెలుసు.. ఈ ఎమ్మెల్యే తెలుసు అంటూ బెదిరిస్తున్నారు. పోలీసులు వస్తే వారిని రాజకీయ నాయకులతో భయపెట్టిస్తున్నారు’ అంటూ టీఎస్ ఆర్టీసీ యూనియర్ నాయకుడు రాజిరెడ్డి కోడలు పావని కన్నీరుమున్నీరు అయ్యారు.
ఆమె ఎల్బీ నగర్ లోని ఆమె అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. పెళ్లి సమయంలో తాము ఇచ్చిన 30 తులాల బంగారం ఇవ్వాలని కోరింది. పెళ్లికి రూ. 30 లక్షల అప్పు చేశామని, ఆ అప్పు తీర్చడానికి తనకు తండ్రి కూడాలేడని కన్నీరు పెట్టుకుంది. అప్పుల వాళ్లు ఇంటిమీద పడుతున్నారని, బంగారం ఇస్తే కొంతైనా అప్పు తీర్చుకుంటా అని వాపోయింది. బంగారం ఇవ్వకుండా రాజకీయ నాయకుల పలుకుబడితో తన మామ రాజిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.