బీజేపీపై MP GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలకు వున్న కుటుంబ అవసరాల నేపథ్యంలో వైజాగ్ లో BJP పోటీ చేసే అవకాశం రాలేదన్నారు. GVL ఫర్ వైజాగ్ అనేది నా లైవ్ టైం కమిట్మెంట్…విశాఖ అభివృద్ధిపై పార్టీల హామీలతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత మ్యానిఫెస్టో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు కలుషితం అయ్యాయి….ధన ప్రభావం పెరిగితే వ్యాపారం అవుతుంది తప్ప రాజకీయం కాదన్నారు.
ఏపీలో జై మోదీ అంటేనే ఓట్ ట్రాన్స్ ఫర్ అయ్యేది…వికీపీడియా లో జీ వీ ఎల్ కాపు సామాజిక వర్గ నేతగా గుర్తించారని ఆగ్రహించారు. పొత్తులు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో సీటు దక్కకపోవచ్చు..బీజేపీ పార్టీ ఆదేశిస్తే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు. కొంత మందికి సీట్లు ఇవ్వకపోవడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అవదన్న విశ్లేషణలు విన్నాం…స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కార్మికుల మనోభావాలకు అనుగుణంగా పరిష్కరిస్తామని చెప్పారు MP GVL.